లోక్‌సభ రెండుగంటలకు వాయిదా

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా వాయిదాల పర్వం ప్రారంభమైంది. తొలుత లోక్‌సభ ప్రారంభం కాగానే రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట మృతులకు సభ సంతాపం తెలిపింది. ఆ తర్వాత ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలు అడ్డుకోవడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ గంటపాటు వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో లోక్‌సభను మధ్యాహ్నం రెండుగంటలకు వాయిదా వేశారు.