
కేంద్రం 47 మంది ఎంపీల బస నిమిత్తం ఇటీవల రూ.24 కోట్లు చెల్లించింది. బీజేపీ, కాంగ్రెస్, అన్నాడీఎంకే, ఆమ్‌ఆద్మీ తదితర పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరంతా ఫైవ్‌స్టార్ హోటళ్లలో, ప్రభుత్వ అతిథిగృహా ల్లో 14 నెలలుగా ఆతిథ్యం పొందుతున్నారు. సాధారణంగా కొత్తగా ఎన్నికైన ఎంపీలకు ప్రభుత్వం 30 రోజుల్లోగా ఢిల్లీలో ఫ్లాట్లు కేటాయించాలి. అప్పటివరకు వారి తాత్కాలిక బసకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అయితే, 10 మందికి కేటాయించిన భవనాలు నివాసయోగ్యమే అయినా, వారు వాటిలోకి మారనందువల్ల భారం పడుతోంది.