
ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాహుల్ గాంధీ రాష్ట్రంలో అడుగుపెట్టాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ నేతలకు ఇక్కడి ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ అధినేత కుమారుడు రాహుల్‌గాంధీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రంలో అడుగుపెడుతున్నారని నిలదీశారు. మరో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ సోనియా, రాహుల్ ప్రజలకు తీవ్ర నష్టం చేశారని, ఏకపక్షంగా మాటలు విని రాష్ట్రాన్ని విభజించారని తీవ్రంగా విమర్శించారు.