విశాఖ నగరంలోను, జిల్లాలో పలు మండలాల్లో బషీర్ బాగ్ విద్యుత్ అమరులకు నివాళ్ళు అర్పించారు.
విశాఖ నగరంలో జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నరసింగరావు మాట్లాడుతూ 21 సంవత్సరాల క్రితం విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ బషీర్ బాగ్ వద్ద ఆందోళన చేసిన వారిపై అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాల్పులు జరిపించి రామకృష్ణ ,బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి లను పొట్టనపెట్టుకుందని. వందలాది మంది గాయపర్చారన్నారు. ఆనాటి పోరాటం ఫలితంగా, తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీల పెంచలేదు. అయితే రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ సంస్కరణల బిల్లును అమలు చేయడానికి అంగీకరించింది. ఇది అత్యంత దుర్మార్గం. ఇది అమల్లోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ లభించదు. ఎస్ సి ,ఎస్ టి వంటి వెనుకబడిన తరగతుల వారికి ఉచిత విద్యుత్తు వుండదు. విద్యుత్ చార్జీలు భారీగా పెరిగి ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది.