లలిత్‌మోదీపై రాజ్యసభలోగందరగోళం

లలిత్‌ మోదీ వ్యవహారంపై రాజ్యసభలో గందరగోళం నెలకొనడంతో సభ అరగంట వాయిదా పడింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే లలిత్‌మోదీ విషయమై చర్చకు కాంగ్రెస్‌ పట్టుబట్టింది. వీసా వివాదంపై చర్చకు సిద్ధమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేసినప్పటికీ సభ్యులు శాంతించకపోవడంతో డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ సభను వాయిదా వేశారు.