పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలకు నిరసన

ఈ నెల రోజుల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోలు ధరలను 20 సార్లు పెంచింది. ఫలితంగా డీజిల్ పెట్రోల్ ధరలకు తేడా లేకుండా పోయింది. ప్రజలు కరోనా మహమ్మారితో పోరాటం చేస్తుంటే ప్రజలపై కేంద్ర ప్రభుత్వo భారాలు వేయటం పద్దతి కాదు . డీజిల్ పెట్రోల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన గాని రకరకాల టాక్స్లు వేసి ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం చాలా బాధాకరం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చెసింది.