
మున్సిపల్ ఉద్యోగు లు, కార్మికుల నిరవధిక సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. మున్సిపల్ జేఏసీ నాయకులు ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్య క్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగుల్లో అధిక శాతం దళితులే ఉన్నారన్నారు. వారికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కూడా అటకెక్కించిన ఘనత చంద్ర బాబు ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. గతే డాది ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిగి న సందర్భంలో మున్సిపల్ కార్మికులకు కూడా వేతనాలు పెంచుతామని చంద్రబాబు వాగ్దానం చేశారని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్ ఉద్యోగుల ఆందోళనను అణచివేయడానికి వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏర్పాట్ల ద్వారా కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అయినా సమ్మెను ఆపడం చంద్రబాబు తరం కాదన్నారు. సీఎం సత్వరమే కార్మికులతో సంప్రదింపులు చేయా లని, లేకపోతే నాలుగేళ్లపాటు రోడ్డుపై తిరిగే అవకాశాన్ని కోల్పోతారని హెచ్చరించారు.