స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో బంద్

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ, కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా విశాఖలో  అఖిల పక్ష పార్టీలు బంద్  నిర్వహించాయి..విశాఖ ఉక్కు అమ్మేహక్కు కేంద్రానికి లేదన్నారు. ఎందుకంటే ఎన్నో త్యాగాల పునాదిపై విశాఖ ఉక్కు నిలబడి ఉందన్నారు.కేంద్రం మెడలు వంచైనా విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ బంద్‌ ఉద్యమానికి ఆరంభమేనన్నారు. బిజెపి నేతలు రాష్ట్ర ప్రజలను ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.