
భారతదేశాన్ని హిందూ దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ విశ్వహిందూ పరిషత్ కృషి చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్‌తొగాడియా చెప్పారు. జిల్లాలోని అశ్వరావుపేటలో పర్యటించిన ప్రవీణ్‌తొగాడియా మీడియాతో మాట్లాడారు. మత మార్పిడులను అడ్డుకోవడంతోపాటు గోపూజలు చేయడం, పేద హిందువులకు ఉచితంగా విద్యా, వైద్యం అందించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామన్నారు. ముస్లిమ్‌లు, క్రైస్తవులకు మక్కా, వాటికన్ సిటీల యాత్రలకు డబ్బులు ఇస్తున్నారని కాని హిందువులను విస్మరిస్తున్నారన్నారు. హిందువుల అభివృద్ధికి తాము కట్టుబడి పనిచేస్తున్నామన్నారు. దేశంలో వంద కోట్ల మంది ఉన్న హిందువులు ఏకతాటిపైకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.