ఇళ్లు తక్షణమే పేదలకు కేటాయించాలి..

రాష్ట్రంలో పేదల కొరకు కట్టి ఖాళీగా ఉంచిన నాలుగు లక్షల ఇళ్ళు టిడిపి ,బిజెపి ,వైసిపి పార్టీల సొమ్ముతో నిర్మించినవి కావు ,ప్రజల సొమ్ము (ప్రభుత్వ నిధుల)తో కట్టిన ఇళ్లు తక్షణమే పేదలకు కేటాయించాలని డిమాండ్..
విజయవాడ నగరంలో డిస్నీలాండ్ లో 57ఎకరాలు ,సమీపంలో రైల్వే శాఖ కు ఇచ్చిన 26 ఎకరాలు ,పాత డంపింగ్ యార్డ్ లో 32 ఎకరాలు అజిత్ సింగ్ నగర్ లో మొత్తం 115 ఎకరాలు ప్రభుత్వం అందుబాటులో ఉన్నాయి. ఈ స్థలాలు పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించకుండా నగరానికి లో 20 కిలోమీటర్ల దూరంలో రాజధాని అమరావతిలోను కంకిపాడు ,గన్నవరం ఏరియాలో కేటాయించడం లో అంతరార్థం ఏమిటి? నగరంలోని విలువైన స్థలాలు బిల్డ్ ఏపీ పేరుతో అన్ని ఖజానా నింపుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందా?
సెంటు స్థలం కాకుండా రెండు సెంట్లు 100 చదరపు గజాలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలి. నయా పైసా ఖర్చు లేకుండా పేదలందరికీ ఉచితంగా ఇళ్లు ఇస్తామన్నా వైయస్సార్ పార్టీ హామీని నిలబెట్టుకోవాలి,పేదల చెల్లించిన డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలి.లబ్ధిదారుల జాబితాలోని లోపాలను వెంటనే సరిదిద్దాలి. విజయవాడ డిస్నీల్యాండ్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన, ఆందోళన..ఆందోళనలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు తదితరులు