రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై

రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో సిపిఎం బృందం పర్యటన..
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మార్కెట్లు మూతబడి, అంతర్ రాష్ట్ర రవాణా లేక పండించిన పళ్ళు ,కూరగాయలకు రేట్లు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులను ఆదుకుంటామని మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా ఆచరణ బిన్నంగా ఉంది.మరోవైపు పంటలు తగినంతగా కోయక కూలీలకు పని దినాలు తగ్గిపోయాయి, ఉపాధి హామీ పథకం రాజధాని తదితర ప్రాంతాల్లో అమలు జరగడంలేదని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు విమర్శించారు..