రెడ్ జోన్ ప్రాంతంలో మాస్కుల పంపిణీ

విజయవాడ 61 వ డివిజన్ శాంతినగర్ లో సిపిఎం అధ్వర్యంలో ఇంటింటికీ మాస్కులు పంపిణీ చేశారు.రెడ్ జోన్ పరిధిలో ప్రజలకు కనీస సౌకర్యాలు, నిత్యవసర సరుకులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. ప్రభుత్వం మద్యం షాపులు తెరవడం పై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉదయం తొమ్మిది గంటల వరకే తమకి వ్యాపారం చేసుకోడానికి అనుమతి వుందని, ప్రభుత్వం మాత్రం సాయంత్రం వరకు మద్యం అమ్మకాలు చేస్తోందని చిరు వ్యాపారులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు