
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది గడిచినా ఇంకా ఉమ్మడి హైకోర్టులోనే న్యాయవ్యవస్థ కొనసాగడంలో అర్థం లేదని, తక్షణమే హైకోర్టును విభజించాలని తెరాస ఎంపీలు గవర్నర్ నరసింహన్‌కు గురువారం విజ్ఞప్తి చేశారు. ఎంపీలు జితేందర్ రెడ్డి, కె.కేశవరావు, కవిత, వినోద్, కె.విశే్వశ్వర రెడ్డి తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. హైకోర్టు విభజనపై కేంద్రం స్పష్టమైన చర్యలు తీసుకోకుంటే పార్లమెంటులో తాము ఆందోళన చేస్తామని ఎంపీలు ప్రకటించారు.