
ఆరెసెస్ దాని రాజకీయ పక్షమైన బిజెపి గురించి ఎన్నో రహస్యాలు ఎన్నో వాస్తవాలు విషకౌగిలో బహిర్గతమయ్యాయి.. 1991 లో జరిగిన ఎల్ కె అద్వాని రామ్ రధ యాత్ర ఎలా మత విద్వేషాలను రెచ్చగొట్టి 1992 డిసెంబర్ అయోధ్యలో బాబ్రీ మసీదు విద్వంసానికి దారి తీసిందో "రామ్ కె నామ్" చూపెట్టగా అదేకాలంలో రచించబడ్డ "విషకౌగిలి" ఆ విద్వంసకారుల శిక్షణ సంస్థను బట్టబయలు చేసింది .. ఆరెసెస్ లో దశాబ్ద కాలం పాటు ముఖ్య కార్యకర్తగా పనిచేసిన వేయిరేకుల పద్మంలోంచి ఒక్కొక్క బ్రాంతి దళం రాలిపోతుండగా మతోన్మాద కౌగిలి నుండి మానవత్వం వొడిలోకి ప్రస్థానం చేసిన " విశ్వం " కె ఇది సాధ్యం..
స్వయం సేవక సోదరులారా కళ్ళు తెరవండి.. పుస్తక రచయిత " విశ్వం " కలం నుండి జాలువారిన నవలిక పుంజం .. మతోన్మాద వ్యతిరేక శక్తుల చేతిలోని సిద్ధాంత ఆయుధం .. " విషకౌగిలి "
సోల్ డిస్త్రిబ్యుటర్ : నవయుగ బుక్ హౌస్ ,సుల్తాన్ బజార్, హైదరాబాద్
వేల : రు .15/-