గ్రీస్‌సంక్షోభానికి పరిష్కారం

ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని రుణభారంతో సతమతం అవుతున్న గ్రీస్‌ దేశాన్ని యూరోజోన్‌లోనే కొనసాగించేందుకు యూరోజోన్‌ సభ్యదేశాలు సమ్మతించాయి. గ్రీస్‌కకు కొత్త ఉద్దీపన ప్యాకేజిలు కూడా లభిస్తున్నాయి. ప్రజలపై కఠిన షరతులతో కూడిన కొత్త సంస్కరణలు చేపట్టి ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు గ్రీస్‌ప్రయత్నించాల్సి ఉంటుంది. గ్రీస్‌ను యూరోజోన్‌లో ఉంచేందుకు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారని, ఆర్ధిక సం స్కరణలు, కఠిన షరతులతో గ్రీస్‌కు మూడో విడత బెయిల్‌ఔట్‌ ప్యాకేజి కింద రుణపరతిని అందిం చేందుకు సహకరించినట్లు యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్‌ సోమవారం వెల్లడించారు. రుణదాతల కఠిన షరతులకు గ్రీస్‌ప్రధాని అలెక్సిస్‌ సిప్రాస్‌ అంగీకరించినట్లు యూరోపియన్‌ నేతలు ప్రకటించారు. అలాగే మూడేళ్లపాటు అత్యవసర రుణప్యాకేజి కింద ప్రతిఏటా 86 బిలియన్‌ డాలర్లను పంపిణీచేయాలని సిప్రాస్‌ప్రతిపాదనకు యూరోజోన్‌ నాయకులు సమ్మతించారు. గ్రీస్‌లో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దేందుకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హాలెండీ, జర్మనీ అధ్యక్షురాలు ఏంజెల్లా మార్కెల్‌తో విస్తృత చర్చలు జరిపారు. యూరోజోన్‌ ఆర్ధిక మంత్రుల సదస్సు అనంతరం, తిరిగి యూరోపియన్‌యూనియన్‌లోని 19దేశాల నేతలు గ్రీస్‌ బెయిల్‌ఔట్‌ ప్యాకేజికి సమ్మ తించడంతో అత్యవసర నిధులను అందించేందుకు కూడా అంగీకరించాయి. దీనితో గ్రీస్‌కు ఐరోపాకూటమినుంచి వైదొలిగే ప్రమాదం తప్పింది. అలాగేగ్రీస్‌లో పన్నులు పెంచాలని, పెన్షనర్ల జోలికి వెళ్లకుండా ఆర్ధిక సంస్కరణలు అమలుచేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వ్యయంలో తగ్గింపులు కోతలు అమలుచేయాలని అంతర్జాతీయ రుణదాతలు ఐఎంఎఫ్‌, యూరోపియన్‌ సెంట్రల్‌బ్యాంకు, యూరోజోన్‌ నేతలు డిమాండ్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు తీవ్రంగా వ్యతిరేకించిన వామపక్ష షిరిజా ఆధ్వర్యంలో సిప్రాస్‌ ప్రభుత్వం నిర్వహించిన రిఫరెండమ్‌లో రుణదాతలకు వ్యతి రేకంగా గ్రీస్‌ప్రజలు ఓటువేసారు. అయితే చివరి నిమిషం వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ చర్చ ల్లో గ్రీస్‌ ప్రదాని ఎట్టకేలకు రుణదాతల డిమాండ్లకు తలొగ్గక తప్పలేదు. అయితే ఆయన డిమాండ్‌ చేసి న 86 బిలియన్‌యూరోల అత్యవసరరుణపరపతిని మూడేళ్లపాటు కొనసాగించాలన్న డిమాండ్‌ను మాత్రం సాధించుకోగలిగారు. - See more at: http://www.vaartha.com/node/1948#sthash.pMO0EPUQ.dpuf