
నీతి ఆయోగ్ సమావేశం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశం ప్రధాని నివాసంలో కొనసాగుతోంది. సమావేశానికి 14 రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి ఆయా రాష్ర్టాల సీఎంలు హాజరు కాకపోవడానికి కారణం వివాదాస్పద భూసేకరణ బిల్లుపై చర్చించడమే. సమావేశానికి ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌తో పాటు బీహార్ సిఎం నితీష్‌కుమార్ హాజరయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులతో పాటు యూపి సిఎం అఖిలేష్, బెంగాల్ సీఎం మమత హాజరు కాలేదు. భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, అఖిలేష్, మమత స్పష్టం చేశారు. తమిళనాడు సిఎం జయలలిత కూడా భూసేకరణ బిల్లుకు మద్దతు ఇవ్వమని తేల్చిచెప్పారు.