
గుంటూరులో అక్రమంగా అరెస్టు చేసిన ముస్లిం యువకులను వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన అక్రమకేసులను ఎత్తివేయాలని కోరుతూ సిపిఎం,సిపిఐల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.అక్రమంగా అరెస్టు అయిన బాధితుల కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరిన సిపిఎం కార్యకర్తలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య, సిపిఐ నాయకులు ఓబులేసు, మాజీ ఎమ్మేల్సీ కె.ఎస్ లక్ష్మణరావులను అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు