
మండలంలోని విఠంరాజుపల్లిలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుంటుంబాలకు సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో వంటసామగ్రిని, దుస్తులను శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి కె.హను మంతరెడ్డి మాట్లాడుతూ అగ్నిప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పక్కా గృహాలు మంజూరు చేయటంతో పాటు ప్రమాదంలో పంటను కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు భోజనప్లేట్లు, చెంబులు, గ్లాసులు, టిఫిన్ బాక్స్‌లు అందించారు. ఎంపిటిసి సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస రడ్డి దుస్తులు, వంటసామాగ్రి, దుప్పట్లు పంపిణీ చేశారు.