
జేఎన్‌యూలో అదృశ్య మైన విద్యార్థి నజీబ్ అహ్మద్‌ను వెతికిం చడంలో జేఎన్ యూ వీసీ అలసత్వం ప్రదర్శి స్తున్నారని ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సహా పలువురు వక్తలు ఆరోపించారు.జేఎన్‌యూ వెలుపల మీ ఆందోళనను కొనసాగించండి' అని విద్యార్థులకు కేజ్రీవాల్ సూచించారు. 'ఇండియా గేట్ వద్ద కూర్చోండి. నజీబ్ కోసం పోరాడేందుకు యావత్ దేశ మద్దతు కోరండి. నేను మీతో ఉన్నాను. ఆందోళనలో నేను కూడా భాగస్వామి అవుతాను' అని కేేజ్రీవాల్ అన్నారు.