
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని అరెస్ట్ చేయటం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికర సంకేతాలను పంపుతున్నదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి విమర్శించారు. మాజీ సైనికులు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ (ఓఆర్ఓపీ) విధానంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసగా మాజీ సైనికుడు రామ్‌కిషన్ గ్రేవల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం ఇక్కడి కళామందిర్లో జరిగిన అబ్దుల్ హలీమ్ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఏచూరి మాట్లాడారు. గ్రేవల్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్‌గాంధీ, ఢిల్లీ ప్రభుత్వ నేతలు కేజ్రీవాల్, తదితరులను అరెస్ట్ చేయటం ద్వారా మోడీ సర్కారు తన నియంతృత్వధోరణిని మరోమారు బయటపెట్టుకున్నదని విమర్శించారు.