
వ్యాపమ్ కేసులో నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు జరగడానికి వీలుగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై ఒత్తిడి పెంచేందుకు జూలై 16న మధ్య ప్రదేశ్లో సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలో కలసి రావాల్సిందిగా సోదర వామపక్ష పార్టీలకు, ఇతర ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసింది. పార్టీ సీనియర్ నేత మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ పీపుల్స్ డెమొక్రసీ తాజా సంచికలో రాసిన సంపాద కీయంలో ఈ మేరకు పిలుపు నిచ్చారు.