
కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు శుక్రవారం సంపూర్ణంగా సమ్మె నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గన్నారు. నాబార్డ్ ఉద్యోగులు కూడా పాల్గని సమ్మెను విజయవంతం చేశారు.పశ్చిమ బెంగాల్లో స్థానిక యంత్రాంగం, పోలీసుల నుండి బెదిరింపులు ఎదురైనప్పటికీ బ్యాంకు, నాబార్డ్ ఉద్యోగులు వాటిని లెక్క చేయక సమ్మెలో పాల్గని జయప్రదం చేశారు