
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను సాఫీగా అమల్లోకి తెచ్చేందుకు వాణిజ్య, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో ఎక్సైజ్, కస్టమ్స్ కేంద్రీయ బోర్డు (సీబీఈసీ) సంప్రదింపులు చేపట్టింది. బుధవారం ప్రారంభమై, శుక్రవారం వరకు కొనసాగనున్న ఈ సంప్రదింపుల్లో రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా, సీనియర్ అధికారులు పాల్గొంటున్నారు.సమాచార, సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ), ఐటీ ఆధారిత సేవారంగాల (ఐటీఈఎస్), రవాణా రంగ ప్రతినిధులతో అధియా, సీనియర్ అధికారుల చర్చలు పూర్తయ్యాయి. ఇ కామర్స్, టెలికాం, బ్యాంకింగ్, చమురు-సహజవాయువు రంగాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.