
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నిరర్థక ఆస్తులు బ్యాంకుల పాలిట శరాఘాతాలయ్యాయి. 8.5శాతంతో అవి రెట్టింపు అయినట్లు కేర్ రేటింగ్స్ ఏజెన్సీ పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు 4.6శాతం ఉండటం గమనార్హం.ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి ఈ నిరర్థక ఆస్తులు జూన్ 2015లో 5.3శాతం ఉండగా, ఈ ఏడాది అవి 10.4శాతానికి చేరాయి.