
చేనేత శాఖ మంత్రిగా స్మతి ఇరానీ బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు కూడా గడవకముందే ఆ శాఖలో మరో వివాదాన్ని మూటగట్టుకున్నారు. అత్యంత సీనియర్ అధికారి, చేనేత శాఖ కార్యదర్శి రష్మీ వర్మతో వివాదానికి దిగారు.జూన్ 22న క్యాబినెట్ ఆమోదించిన రూ. 6వేల కోట్ల రూపాయల దుస్తులు, వస్త్ర ప్యాకేజీకి సంబంధించి, అక్టోబర్లో జరుగబోయే టెక్స్టైల్ సదస్సు, తదితర విషయాలపై విధానపరమైన పరిపాలనకు సంబంధించి కార్యదర్శితో వివాదాలు నెలకొన్నాయి. ఇతర అధికారుల ముందే కార్యదర్శితో స్మృతి వాగ్వివాదానికి దిగినట్టు టెక్స్టైల్ శాఖ వర్గాలు తెలిపాయి.