
మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక సంస్కరణలను నిరసిస్తూ కార్మిక సంఘాలు సెప్టెంబరు 2న తలపెట్టిన సమ్మెలో పాల్గొనాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. బ్యాకింగ్ పరిశ్రమపై దాడులు పెరిగిపోయాయని, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సి.హెచ్.వెంకటాచలం తెలిపారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.