
తెలుగుదేశం పార్టీ(టిడిపి)ని ఒక తెలుగు డ్రామా పార్టీగా కాంగ్రెస్ సభ్యులు జైరాం రమేష్ అభివర్ణించారు. ప్రత్యేక హోదా సాధనలో ఆ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు కెవిపి రామచంద్రరావు, టి.సుబ్బిరామి రెడ్డి, ఏపిసిసి చీఫ్ రఘువీరాతో కలసి బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండు చేశారు.