నాలుగు నిఘా విమానాల కొనుగోలు కోసం అమెరికాతో భారత్ బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 6,700 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది. దీర్ఘశ్రేణి సముద్ర నిఘా వ్యవస్థ కలిగిన, జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విమానాలు ‘పోసిడాన్-8ఐ’(పీ-8ఐ)లను కొనేందుకు అమెరికా రక్షణ శాఖ, విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తో దీన్ని కుదుర్చుకుంది.