
జిఎస్టీ బిల్లు కాంగ్రెస్, బిజెపి వ్యవహారం కాదని సిపిఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ పక్షనేత సీతారామ్ ఏచూరి పేర్కొన్నారు. ఇది అన్ని పక్షాలకు, దేశ ప్రజలకు సంబంధించిన అంశమని అఖిల పక్ష సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. గత రెండేళ్లగా సిపిఎం తరపున అఖిల పక్షం వేయాలని కోరుతున్నామన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు.