స్విస్‌ ఛాలెంజ్‌ బహిరంగం

నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా సింగపూర్‌ కన్సార్టియం దాఖలు చేసిన స్విస్‌ ఛాలెంజ్‌ ప్రతిపాదనను బహిరంగ పరిచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లభించింది. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి స్విస్‌ ఛాలెంజ్‌పై ఉత్తర్వులు కూడా జారీ చేశారు.ఈ ఛాలెంజ్‌ ప్రతిపాదనను బాహాటంగా ప్రకటించి, ఇతర సంస్థల నుంచి కౌంటర్‌ ఛాలెంజ్‌ కోరాల్సి ఉంటుంది. వీలైంత త్వరగా ఛాలెంజ్‌ను బహిరంగపరచాలని నిర్ణయించారు. ముఖ్య మంత్రితో కూడా చర్చించామని, సోమవారం దీన్ని ప్రకటించే అవకాశాలున్నాయని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. సింగపూర్‌ సంస్థల కన్సార్టియం దాఖలుచేసిన ప్రతిపాదనలకు ఇతర సంస్థల నుంచి ఛాలెంజ్‌లు ఎక్కువగా వచ్చే అవకాశా లున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.