రవాణా రంగాన్ని ప్రయివేటుపరం..

రోడ్డు రవాణా, భద్రత ముసాయిదా బిల్లు (2015) లక్ష్యం మోటార్‌ రవాణా రంగాన్ని మొత్తంగా ప్రయివేటుపరం చేయడమేనని కేంద్ర కార్మిక సంఘాలు ఆరోపించాయి. రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును వ్రవేశపెట్టాలని కొందరు ఎంపీలు లేఖ రాయడం ఆశ్చర్యకరమని సీఐటీయూ, అఖిల భారత రోడ్డు రవాణా కార్మిక సమాఖ్య (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌)లు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.