దేశంలోకి పెద్దఎత్తున పెట్టుబడులతో పాటు విదేశీ టూరిస్టులను ఆకట్టుకునేందుకు మోడీ సర్కార్ వీసా పాలసీని సరళీకరించాలని నిర్ణయించింది. పలు వీసా విభాగాలను ఏకీకృతం చేసేందుకు సంసిద్ధమైంది. బిజినెస్, టూరిస్టు, మెడికల్ వీసాను ఒక్కటిగా విలీనం చేసే ప్రతిపాదనకు హోంమంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.