
సంప్రదాయక విధానానికి స్వస్తి చెప్పి, రాష్ట్రంలో కొత్త తరహా పాలనలో కేరళను అభివృద్ధి దిశలో నడిపేందుకు, అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు ఆ రాష్ట్ర ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రానున్న ఐదేండ్లలో ఐటీ, బయోటెక్నాలజీ, పర్యాటక రంగాల్లో కొత్తగా పది లక్షల ఉద్యోగాలను, వ్యవసాయ రంగంలో మరో 15 లక్షల ఉద్యోగాలను కల్పించేందుకు ప్రణాళికా రచన చేస్తున్నట్టు పినరయి విజయన్ ప్రభుత్వం పేర్కొంది.