సియోల్‌ ప్లీనరీ..ఫలించని భారత్‌ యత్నాలు

అంతర్జాతీయ అణ్వ్తస్తాలు వ్యాప్తి చెందకుండా నిరోధించాలంటే ఎన్‌పీటీ (అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం) ని పూర్తి స్థాయిలో, సమర్ధవంతంగా అమలు చేయడమే కీలకమని సియోల్‌ ప్లీనరీ సమావేశాలు ప్రకటించాయి. గత రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న ఈ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. అంటే భారత్‌కు అణు సరఫరా దేశాల గ్రూపు (ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం ఇచ్చే విషయంలో ఎలాంటి మినహాయింపులు వుండబోవని దీంతో స్పష్టమైంది