
సాహిత్య ప్రియులకు ప్రోత్సాహకరంగా గత ఆరు శతాబ్దాలుగా పనిచేస్తున్న ‘నేషనల్ బుక్ ట్రస్ట్’పైనా కాషాయం రంగు పడింది. ఆర్థిక అవకతవకలకు అవకాశం లేకుండా పుస్తకాల క్రయవిక్రయాల ఆర్థిక లావాదేవీలను ఓ ప్రైవేటు ప్రొఫెషనల్ కంపెనీకి టెండర్ ప్రక్రియ ద్వారా అప్పగించే వ్యవస్థను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఏకపక్షంగా రద్దు చేశారు. ఈ విషయంలో నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్నుగానీ, ట్రస్టీ సభ్యులనుగానీ ఏమాత్రం సంప్రతించకుండానే ఏకపక్షంగా ఆమె నిర్ణయం తీసుకున్నారు.