
రాజధానిలో భూ పందేరం మొదలైంది. అమరావతి డెవలప్‌మెంట్ కంపెనీ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీివి)ఏర్పాటు చేసి దాని ద్వారా సింగపూర్‌కు భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం సీడ్ క్యాపిటల్ ఏరియాలో భూములు ఎంపిక చేశారు. సచివాలయ నిర్మాణ పనులకు అవసరమైన నిధులు కేంద్రం నుండి వచ్చే పరిస్థితి లేదని, ఈ సమయంలో ముందడుగు వేయకపోతే పనులు ఆలస్యమె ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడుతుందని రాజధాని అభివృద్ధి కమిటీ సభ్యుడొకరు తెలిపారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, వెంటనే భూములు కేటాయిస్తే సింగపూర్ కంపెనీలు నిర్మాణాలు మొదలుపెడతాయని, ఇది రాజధాని అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.