SBIలో SBH విలీనం ఆపాలి:CPM

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌)ను విలీనం చేసే ప్రక్రియను తక్షణమే ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులన్నింటిలో అగ్రగామిగా నిలిచి రాష్ట్రంలో రూ.2.50 లక్షల కోట్ల టర్నోవర్‌ కలిగిన ఎస్‌బీహెచ్‌ను విలీనం కాకుండా రక్షించుకోవడం చారిత్రక అవసరమని తెలిపారు.