మూడు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్‌

 తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఓటర్లు పోటెత్తారు. సోమవారం ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ ఆ తర్వాత ఊపందుకుంది. సాయంత్రం ఆరు గంటలలోపు క్యూలలో నిల్చున్నవారందరికీ ఓటు హక్కు విని యోగించుకునేందుకు అధికారులు అనుమతిం చారు. అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆయా రాష్ట్రాల్లో పోలింగ్‌ శాతం తగ్గడం విశేషం.