
కేరళ సీపీఎం కురువృద్ధ నేత, మాజీ సీఎం వీఎస్ అచ్చుతానందన్ తనదైన శైలిలో ప్రధాని నరేంద్రమోదీపై ఘాటు విమర్శలు చేశారు. ఎంతసేపు స్వచ్ఛ భారత్, మరుగుదొడ్ల నిర్మాణం అని చెప్పే మోదీ.. ముందు దేశంలో చాలామందికి తినడానికి తిండి కూడా లేదనే విషయం గుర్తించాలని అన్నారు. అసలు తిండే లేనప్పుడు మరుగుదొడ్డి కట్టుకొని ఏం చేస్తారని ఆయన వినూత్న విమర్శ చేశారు.