కేరళ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల్లో 202 మంది కోటీశ్వరులున్నారట. అంతేగాక.. 311 మంది అభ్యర్థులపై నేరారోపణలు ఉన్నట్లు తెలిసింది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), కేరళ ఎన్నికల పరిశీలన కమిటీ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.