
మహారాష్ట్రలో భారీ ఆరోగ్య పథకం ‘రాజీవ్‌గాంధీ జీవనదాయీ ఆరోగ్య యోజన(ఆర్జీజేఏవై)’లో అనైతిక వ్యాపార కార్యకలాపాలు, అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఓ టాస్క్‌ఫోర్స్ వెలుగులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు ఇటీవల సమర్పించిన నివేదిక ప్రకారం.. ఆర్జీజేఏవైలో ఆర్థిక అవకతవకల కారణంగా గత మూడేళ్ల కాలవ్యవధిలో ప్రభుత్వ ఖజానాకు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లింది.