
జేఎన్‌యూ అకడమిక్ కౌన్సిల్ (ఏసీ) సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. నిరాహారదీక్ష కొనసాగిస్తున్న విద్యార్థులు మధ్యాహ్నం తమ దీక్షా స్థలాన్ని సమావేశం జరిగే సోషల్ సైన్సెస్ విభాగం భవనం వద్దకు మార్చారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు అన్ని ద్వారాల వద్ద నినాదాలు చేశారు. వీసీ జగదీశ్‌కుమార్ విద్యార్థులున్న చోటి నుంచి కాకుండా వేరే మార్గం గుండా మీటింగ్ హాల్‌కు చేరుకున్నారు. విద్యార్థుల వ్యతిరేకతను మూటగట్టుకున్న మాజీ రిజిస్ట్రార్ భూపిందర్ జుత్షి, ప్రస్తుత రిజిస్ట్రార్, రెక్టార్, ప్రొక్టార్, దళితులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన ప్రొ. అమితాసింగ్ తదితరులు మీటింగ్ హాల్‌కు వెళ్తుండగా విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.