అగస్టా కుంభకోణంపై సుదీర్ఘ చర్చ

అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణంపై పార్ల మెంట్‌లో చర్చ...రచ్చ అయ్యింది. ఈ కుంభకో ణానికి సంభందించి శుక్రవారం కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ లోక్‌సభలో ప్రభుత్వం తరపున ప్రకటన చేశారు. ఈ ప్రకటకతో సభలో గందరగోళం నెలకొంది. అధికార, విపక్షాలు పరస్పర నినాదాలు, అరుపులు, కేకలతో సభ దద్దరి ల్లింది. దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగిన సభలో విపక్ష కాంగ్రెస్‌ సభ్యలు అసహనం తో వాకౌట్‌ చేశారు. పలు సార్లు ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వైఖరిపై మండిపడ్డారు. శుక్రవారం లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించిన వాయిదా తీర్మానంపై చర్చ జరిగింది. తొలుత రక్షణ మంత్రి పారికర్‌ మాట్లాడు తూ... వివిఐపిల కోసం వినియోగించే హెలీకాప్టర్ల కొనుగోలు కాంట్రాక్ట్‌ను దక్కించుకునే ప్రయత్నాలలో అగస్టా వెస్ట్‌లాండ్‌ సంస్థకు గత యుపిఎ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిం చిందని కేంద్రం వెల్లడిం చింది. ఈ వ్యవహారంలో ముడుపులు అందుకున్న లబ్దిదారులను చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకూ నిందితు లుగా బయటపడిన వాయుసేన మాజీ అధిపతి ఎస్‌పి త్యాగి, గౌతమ్‌ ఖైతాన్‌లు అవినీతి గంగా ప్రవాహంలో చేతులు ముంచిన చిన్న స్థాయి వ్యక్తులేనన్నారు. ఈ కుంభకోణంలో రు.3,600 కోట్ల ముడుపులు దక్కించుకున్న ప్రధాన లబ్దిదారులను ప్రభుత్వం వెలిక తీస్తుందని పారికర్‌ పునరుద్ఘాటించారు.