
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ చేసినట్టు ఆధారాలు లేవని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. 1975 నుంచి 1980 వరకు ఢిల్లీ యూనివర్సిటీ ఫైళ్లను తాము పరిశీలించామని కానీ నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ అనే పేరు గల వ్యక్తి డిగ్రీ చేసినట్టు తమకు ఎలాంటి ఆధారాలూ లభించ లేదని ఆప్ నేత ఆశిష్ ఖేతన్ తెలిపారు. రాజ స్థాన్‌లోని అల్వార్ నివాసి అయిన నరేంద్ర కుమార్ మహవీర్ ప్రసాద్ మోడీ అనే వ్యక్తి 1975 -78 కాలంలో డిగ్రీ చేసినట్టు యూనివ ర్సిటీ ఫైళ్లలో ఉన్నదని దానికి నరేంద్ర మోడీ చూపిన డిగ్రీకి పోలికలు లేవని ఆయన తెలిపారు.