33 మందిపై మోడీ వేటు..

మోడీ ప్రభుత్వం 33మంది రెవెన్యూ అధికారులను విధుల నుంచి తొలగించింది. అందులో ఆరుగురు గ్రూప్‌ ఏకు చెందిన అధికారులు ఉండడం గమనార్హం. ఆరుగురు గ్రూపు ఏ అధికారులతో సహా ఇతర శాఖల అధికారులను విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదన్న కారణంతో ముందస్తుగా పదవి నుంచి విరమింపజేసినట్టు ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. రెండు సంవత్సరాల్లో 72 మంది అధికారులను విధుల్లో నుంచి తొలగించినట్టు పేర్కొంది.