PDF సరైన ప్రత్యామ్నాయం:బృందా

తమిళనాట డి.ఎం.కె, ఎ.ఐ.ఎ.డి.ఎం.కె లకు సరైన ప్రత్యామ్నాయం ప్రజా సంక్షేమ కూటమేనని (పిడబ్ల్యుఎఫ్‌) సి.పి.యం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ పేర్కొన్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా బుధవారంనాడు మధురైలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న బృంద సభకు తమ అభ్యర్థులను పరిచయం చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ విధమై న అవినీతి ఆరోపణలు లేని, ఉమ్మడి భావజాలం కలిగిన వారితో తొలిసారిగా ఏర్పడిన కూటమి పిడబ్ల్యుఎఫ్‌ అని, నాలుగు దశాబ్దాలుగా అనేక కీలక రంగాలలో విఫలమైన తమిళనాడును పునర్నిర్మించాలన్న లక్ష్యంతో ఏర్పడిందని పేర్కొన్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమంతో పిడబ్ల్యుఎఫ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడుపుతుందని, సుపరిపాలనను అందిస్తుందని తెలిపారు. డి.ఎం.కె, ఎ.ఐ.ఎ.డి.ఎం.కెలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని, రెండు ద్రవిడ పార్టీల మధ్య ఒక్క అక్షరం మినహా మరేవిధమైన తేడా లేదని ఆరోపించారు.