
మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబీవీకే), ప్రజాశక్తి బుకహేౌస్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని ఐవి ప్యాలెస్‌లో '25 ఏళ్ల సంస్కరణలు - ఫలితాలు' అనే అంశంపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ మాకినేని బసవపున్నయ్య స్మారకోపన్యాసం చేశారు.సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభానికి గురైందన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గాయన్నారు. విదేశీ ఉత్పత్తులను స్వేచ్ఛగా అనుమతించటంతో దేశీయ వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర లభించటంలేదన్నారు. సరళీకరణ వల్ల దేశంలో పారిశ్రామికాభివృద్ధి క్షీణించిందన్నారు. బీహెచ్ఈఎల్ వంటి సంస్థల్లో ఉత్పత్తి తగ్గినట్లు తెలిపారు.