
బ్యాంకులకు పెద్దయెత్తున రుణాలు ఎగ్గొట్టిన కింగ్ఫిషర్ మాజీ అధిపతి విజరు మాల్యా విదేశాల్లో ఆస్తుల కొనుగోలు కోసం రూ. 430 కోట్లు అక్రమంగా దారి మళ్లించారని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ఆదివారం పత్యేక కోర్టుకు తెలిపింది. ఐడిబిఐ బ్యాంకు నుంచి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ తీసుకున్న రూ.950 కోట్ల నుంచే దీనిని మళ్లించినట్లు ఇది వివరించింది.