
పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్లో ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారని, ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. రేంపెక్స్లో ఇద్దరు, మైలాన్లో ఇద్దరు ప్రమాదానికి గురయ్యారని, లోహిత్ ఫార్మాలో బాయిలర్ లీకేజ్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని, ఎస్ఇజెడ్ అలివెరాలోనూ ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు నివారించకుండా కోస్తా తీరమంతా ఫార్మా, పెట్రో, కార్బన్ తదితర విష కంపెనీలు, ప్రమాదకర కంపెనీలను ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల లాభాల కోసం స్థానికులను బలిచేయడం దుర్మార్గమన్నారు. ఫార్మా కంపెనీల్లో భద్రతా చర్యలు చేపట్టే వరకు అన్ని కంపెనీల్లో అందోళనలు చేయాలని ఆయన కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. బ్రాండిక్స్, దివీస్ వద్ద స్ధానికులు, కార్మికుల పోరాటాలకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు.