
నాగ్పూర్ లో కన్నయ్య కుమార్ సభలో భజరంగ్ దళ్, ఏబీవీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నాగ్ పూర్ నేషనల్ కాలేజీలో జరుగుతున్న సభలో కన్నయ్య కుమార్ మాట్లాడుతుండగా, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయనపై చెప్పు విసిరారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. దీంతో భజరంగ్ దళ్, ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.